పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

19, జులై 2018, గురువారం

కలలే...కావ్యాలై

అప్పుడే తెల్లారింది
కాబోలు...
చప్పుడు చేయక
నా మోమును
స్పృశియించిది..
తూరుపు సింధూరం..
కనులు విప్పానో లేదో
కిటికీ నుండే
శుభోదయం చెప్పేసింది
నావైపే...
రెప్పేయక చూస్తూ
అప్పుడప్పుడే రేకులు
విచ్చుకొన్న ఎర్రని మందారం
ఎప్పటిలాగే
మంచుదుప్పటికప్పుకున్న
పచ్చిక ప్రశాంతంగా నవ్వుతూ పలకరించింది...ప్రకృతిలో
పరవశమంతా ...తన వశమన్నట్లు .....
నా కన్నులు చూసిన
దృశ్యాలన్నీ ఎప్పటిలాగే
కనువిందు చేస్తున్నాయి
కానీ...
నిన్నటి రేయి నాకన్నుల
కదిలిన కమ్మని కలలే
తెల్లారగనే...చప్పున
కరిగీ మరుగవుతున్నాయి
నా కన్నులు కాంచిన కలలన్నిటినీ కావ్యాలుగా
అక్షరీకరించాలేమో!
కలకాలం...
కమ్మని ఆ అనుభూతులు
తనివితీరా ...
ఆస్వాదించాలంటే....
ఎట్టాగోలా...
కన్నుల్లోనే కట్టేయాలేమో‌..
కట్టుకధలు చెప్పి జారుకొన్న
నా కిట్టయ్యను..పట్టేయాలంటే
(రాధామాధవప్రణయామృతం)
                       .... శ్రీమణి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి