పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, మార్చి 2017, మంగళవారం

neekai



ఎటు చూసినా గిరులే,పచపచ్చని తరులే 
ఎటు చూసినా విరులు, మరులుగొలుపు ఝరులు 
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబందాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీరాలే 
ఎటు చూసినా తుళ్ళింతలు, కేరింతలు, గిలిగింతలు ,చక్కిలిగింతలే 
వింత వింత అనుభూతుల నా మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించా వినీల గగనం వైపు 
అలా అలా అలలా ఎగిసిన 
 నాహృదయంలో ఒక ఊపిరిఊగిసలాడింది 
తన్మయమొందిన తరుణంలో ఒక  ప్రణయం పలకరించింది. 
అది నాగుండెలో  మానసరాగంలా! మైమరపులసరాగంలా!
 మధుపం పన్నిన వలపులవలలా 
మదనుడు సంధించిన సుమబాణంలా 
నవ ఉషస్సులో మెరిసిన తుషారంలా 
పున్నమి జల్లిన వెన్నెలజడిలా 
కలల మాటునా !కనురెప్పచాటునా కన్నుగీటుతూ పలకరించిన
అరవిరిసిన నా పరువానికి కొత్త అనుభూతిని పంచిన ప్రాయంలా 
ఎదురయ్యింది . 
 అలా నా కన్నె మనస్సులోకి
 కమ్మని కావ్యంలా అరుదెంచిన మరు క్షణం ,
నాలో మొదలయింది నిరీక్షణం 
వేవేల వర్ణాల హరివిల్లు లో నీవు 
చలువల రేడు ప్రతిబింబంలో నీవు 
కలువల సరసన సరసుల్లో నీవు 
చిటపట  చినుకుల చిరుజడిలోనీవు 
నా కన్నె మనసు అలజడిలో నీవు 
ఏ వలపుల వలపన్నావో !!
నా తలపుల్లో 
సవరించిన నా కురులు సాక్షిగా 
నిలువజాల !నిను చూడక

నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే 
సప్త సంద్రాల ఆవల నీవున్నా .. 
నే సప్తపదులు నడిచిన నీకై నిరీక్షిస్తూనే ఉంటా ... 

                                                             సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి