పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

11, మార్చి 2017, శనివారం

ప్ర(కృ)తిఫలం



విరులు విరబూసి నవ్వవా!
వాలుజడ చేరి  వాడినా... 
తరులు తరించిపోవా! 
తమను సాంతం అర్పించుకొన్నా!
నెలజీతం అడిగాయా !సెలయేటి ఝరులు 
మబ్బులు కురవాలని ... డబ్బడిగాయా 
మధువిచ్చి భ్రమరమ్ము మరలి పోదా !
మోయలేనందా.... నేలమ్మ మనను 
రేయి నిద్దరోతుందా !వెన్నెల 
హాయికి వెలకడుతుందా ... 
  పొద్దుపొడవనందా...ప్రతిఫలమేదంటూ 
తెల్లబోయి చూస్తుందా !పిల్లగాలి  వీచక 
నావల్ల కాదని నింగి నీరసించిందా 
నాకెందుకొచ్చిందని జాబిలి నిదరోతుందా 
పడి లేవనంటుందా .. ఎగిసే కెరటం
పురిటినొప్పులకువెరసి 
అమ్మ జన్మనివ్వకుంటే 
మనుగడేదీమనకు పుడమిపైన 
ప్రతిఫలమాశించక ప్రకృతిలో
ప్రతి అణువు పరులకై పరిశ్రమిస్తుంటే 
తనకోసం తానే జీవించే మనిషికి మాత్రం
 ప్రతీ పనిలో ప్రతిఫలాపేక్షణమే.. 
కర్తవ్యం లోనూ... కాసులకైంకర్యమే 
                  (కాదంటారా... నా మాటలని 
                 కొట్టిపారేస్తారా వట్టి మూటలని) 

                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

                                          Pandoorucheruvugattu.blogspot.in







 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి