పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, డిసెంబర్ 2016, బుధవారం

6వ పాశురరత్నము


6వ పాశురరత్నము

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
తెలుగులో భావార్ధము ;
ఈ వ్రతము యొక్క దివ్యమయిన అనుభవమును అందరితో 
సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన దగుటచే తక్కినవారందరలనూ మేల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము. క్రమముగా ఒక్కక్కరినీ లేపెదము. రండు. తెల్లవారిందనుటకు పక్షులు కిలకిలారావములనొనర్చుచు కదలిపోవుచున్నవి సుమా సుమా!ఆ పక్షులయొక్క రాజగు గరుడునిగూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవెలయందు,ఆరాధనయొక్క సమయమును సూచించెడి ప్రభాతసమయ శంఖారావము స్వఛ్చముగా ,పెద్దగా ,రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమోయీ చిన్నపిల్లా !వినపడుటలేదా !లేచిరమ్ము.మేమెటుల వచ్చినామో తెలియునా ?పూతనా రాక్షసియొక్క వక్షములందుగల విషమారగించి,దొంగబండిరీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నియు ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు, ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రనొనరించుచున్న జగత్కారణుడని మన గోశాలయందున్న మునుసమూహములు,యోగాభ్యాసము నాచరించువారలు కూడ ఆ శ్రీకృష్ణుని తమతమ యొక్క మనములందుఅంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగ మెల్లగా లేచి "హరిహరి"యని స్తోత్రమొనరింప వీరందరి యొక్క గొంతులు పెద్దధ్వనియై మా మనస్సులందు చల్లగ ప్రవేశించి లేపివేసినది. ఇపుడు నీవునూ వినియుంటివి గనుక లేచి రావమ్మా!
కడు మనోహరమగు వర్ణనలతో కూడి గోదాతల్లి రచియించి తను తరించి,శ్రీరంగని వరించి,మనల్నీ తరింపచేసిన తిరుప్పావై 6వ పాశురాన్ని,అలంకరణనూ మీముందుంచుతూ,మీ అందరి ఆశీస్సులను కోరుతూ.... 
జై శ్రీమన్నారాయణ .... 
 సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
pandoorucheruvugattu.blogspot.in




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి