పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

18, డిసెంబర్ 2016, ఆదివారం

3వ పాశురరత్నం



3.వ పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్

తెలుగులో భావార్ధము;
రాక్షస రాజగు బలి చక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తమునియొక్క దివ్యములయిన చరణారవిందముల నామముల గానమొనరించి,మనమందరమున్నూ ఈ తిరుప్పావై వ్రతము నాచరించిన దేశమందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షములు కురియును. పంటచేలు అన్నియునూ త్రివిక్రమునివలె వృద్ధినొంది సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు త్రుళ్ళి పడచూ ఉండ,సుందరములయిన కలువలయందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొన్నవిగా నగును. మరియును గోసమృద్ధి విషయమునందునూ గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటునిటు కదలక కూరుచుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలను నింపెడి ఔదార్యము కలవిగా తయారవును . ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమునూ   లభించును. కాబట్టి మనమందరం ఈ వ్రతమాచరించెదము.

మూడవ రోజు పాశురాన్ని పారవశ్యాన పఠించి,ఆధ్యాత్మికామృతాన్ని ఆస్వాదించిన నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ ...... జై శ్రీమన్నారాయణ
   
                                                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి