పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

19, డిసెంబర్ 2016, సోమవారం

4వ పాశుర రత్నం

4వ పాశుర రత్నం 

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


తెలుగులో భావార్ధం; 
ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకూ దేవతాదులు అందరున్నూ తమతమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణ దేవునికలిసికొందుము. గంభీరమైన స్వభావము కల్గి వర్షాధి దేవతవైన ఓ పర్జన్యుడా!నీవు వెనుకంజ వేయబోకుము.గంభీరమయిన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటిని అంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమంతటనూ వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడయిన ఆ శ్రియపతియొక్క శరీరరీతిగా నీల శరీరివై యుండుము. అటు పిమ్మట విశాలము,సుందరములయిన హస్తములుగల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీసుదర్శనచక్రము వలె తళుకుబెళుకుమని మెరసియు, వామహస్తమందలి పాంచజన్యశంఖము వలెనూ లోకములన్నియూ అదురు రీతిన ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారఙ్గమనేడి ధనుస్సుచే విడువబడిన శరవర్షమను రీతిన లోకములు అన్నియును సుఖమునొందునటుల అంతటనూ వర్షించుము. అపుడు మేమున్నూ ఈ మార్గశీర్ష వ్రతస్నానమును ముదమార చేయుదుము. 
ఈనాటి తిరుప్పావై నాల్గవ పాశురాన్ని ముదామారా పాడుకొని పావనమయితి,మీ అందరి ఆశీస్సులకై ఆ పారవశ్యానుభూతిని మీతో పంచుకొంటూ .... 
                                                                                    జై శ్రీమన్నారాయణ 
                                                                            సాలిపల్లిమంగామణి@శ్రీమణి 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి