పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

22, ఆగస్టు 2017, మంగళవారం

అహో

ధరహాసపునీమోమును గని
విరబూసిన
సుమమనుకొని
ఝుమ్మని తుమ్మెద గ్రోలబోయెనే.....శ్రీమణి

21, ఆగస్టు 2017, సోమవారం

ప్రణయమా...అభివందనం

ప్రేమంటే గెలుపు ప్రేమంటే మలుపు ప్రేమంటే తియ తీయని తలపు ప్రేమంటే వసివాడని వలపు ప్రేమంటే ఓదార్పు ప్రేమంటే మాయని మైమరపు ప్రేమంటే ఒక హాయి నిట్టూర్పు ప్రేమంటే జత హృదయాల పలకరింపు ప్రేమంటే ఒక తొలకరి పులకరింపు ప్రేమంటే అనురాగసుధల చిలకరింపు ప్రేమంటే నమ్మకమనే తెగింపు నిజమైన ప్రేమెప్పుడూ త్రిప్పదు మడమ ఓడిపోతే అది కేవలం మోహపు భ్రమ ఎప్పటికీ ప్రేమ మకరంధాన్నే చిందిస్తుంది కన్నీటిని చిమ్మిదంటే ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసిందనే స్వచ్చమైన ప్రేమ మనిషి మట్టి కలిసినా మనస్సునంటే పయనిస్తుంది , మరణమన్నది మనిషికేగా .. మనసుకెందుకు అంటుతుందది అందుకే ప్రణయమా ... నీకు అభివందనం అందుకో .. .. ప్రతీ మది నీరాజనం . సాలిపల్లి మంగామణి @శ్రీమణి pandoorucheruvugattu.blogspot.in

కల-అల

రెపరెపలాడే కనురెప్పలమాటున గుప్పుమన్నకలలెన్నెన్నో
గుప్పెడుగుండెల చప్పుడు మాటున ఉప్పొంగుతున్న అలలెన్నెన్నో...శ్రీమణి

17, ఆగస్టు 2017, గురువారం

ఎంకన్న ఇయ్యాల పలకరించాడు.

ఎంకన్న ఇయ్యాల పలకరించాడు
పలుకుల్లో తేనెల్లు
చిలకరించాడు
      బంగారుఉయ్యాల
     కలలవాకిట్లో
    కొంగుబంగరుతల్లి    అలిమేలుమంగతో        
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
కన్నీరు తుడిచి
పన్నీరు పోసి,
వెతలన్ని తీసేసి
వెన్నెల్లు బోసి,
చిన్నబోయిన నాకు
చిరునవ్వుపూసి 
నేనున్నా ..నీకంటూ
నావెన్నుగాసి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
అమ్మలా లాలించి
అమ్రృతం వడ్డించి
నాన్నలా ఆడించి
నను లాలిపుచ్చి
ఆడించిపాడించి
ఆనందడోలికల
ఓలలాడించి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
.......శ్రీమణి.
ఎవరైనాఈపాటను స్వర పరచగలిగితే నా అద్రృష్టంగాభావిస్తాను.

14, జూన్ 2017, బుధవారం

సినారే .....ఎంత పనిచేసినారే....

మహాసాహిత్యశిఖరం నేలకొరిగిపోయింది.
మహావ్రృక్షం మట్టి కలిసింది
మహోజ్వలతేజం మసకబారిపోయింది
మహా కవిసామ్రాజ్య ధీరం మరలిరాని తీరాలకు
తరలి పోయింది.
అమ్రృతాక్షరాల మహాధ్యాయం
మధురపుటలను మిగిల్చి ముగిసిపోయింది.
తెలుగునేలసిరిసిల్లవాసి,
సుమ సౌరభాల సాహితీ  సిరులరాశి‌,మామనిషి "సినారే "
మా మనసులు కాజేసి,మము కన్నీళ్ళ పాల్జే"సినారే "
మము శోకసంద్రాన ముంచే"సినారే "
ఎంత పని చే"సినారే " శతాబ్థానికొకరయి తెలుగు
వాకిట విరబూ"సినారే "
ఓ మహర్షీ...
ఓ మహాత్మా...
మహోన్నతమూర్తీ...
మానవతామూర్తీ...
ఓ సాహితీ ఘనకీర్తీ...
చలనచిత్ర సాహిత్య చక్రవర్తీ...
అందుకో...మా అశ్రునయనాల
నడుమ లక్షలనివాళి
అందుకోవయ్యా....ఓ అక్షరవనమాలీ........
........శ్రీమణి

17, ఏప్రిల్ 2017, సోమవారం

ప్రణయ ప్రబంధం 

ఎద నందన వనమున 
సుమసుగంధ వీచిక ప్రేమ,
హృదిస్పందన శృతి లయగా 
వినిపించిన మృదుగీతిక ప్రేమ,
మది సాంతం నిండియున్న 
వింత విషయసూచిక ప్రేమ, 
పడుచు మనసున విరిసిన మల్లియ ప్రేమ,
కురిసిన వెన్నెల ప్రేమ 
కలలమాటున.... కనురెప్ప చాటున.... 
కన్నుగీటుతూ పలుకరించిన
కలవరింత ప్రేమ 
తొలి పులకరింత ప్రేమ 
ఇదే ప్రణయ ప్రబంధం 
జతహ్రృదయాలు
రాసుకొనే రసమయ గ్రంధం.
             
        ........... .   శ్రీమణి

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

మరువగలమా..మహాత్మా...

మరువగలమా...మహాత్మా...
మహోన్నతమౌ నీ మానవతా గరిమా...,
అభివర్ణించగలమా...అభిజ్ఞా..
నీ అత్యద్భుత కర్తవ్యధీక్షాపటిమ.
అక్షరాలుచాలునా....
అంబేద్కరా..
అలుపెరుగని
నీ అకుంఠిత సేవాస్ఫూర్తికి,
కడజాతి వారికై
కధనరంగ సింగంలా...
ఎడతెగనీ..నీ తెగింపు.
మరువగలమా..
సమసమాజస్థాపనకై
అస్ప్రశ్యత శ్రృంఖలాల
తెగనరకుటకై,
వెలివాడల బ్రతుకుల్లో..తొలిదివ్వెను
రువ్వేందుకై
దళిత జనోద్దరణకై,
నువ్విచ్చిన పిలుపును,
మధనపడే బ్రతుకుల్లో నువ్విచ్చిన ఓదార్పును,
మరువగలమా...
నువ్వందించిన మహోత్క్రుష్ట రాజ్యాంగాన్ని,
సమానత్వానికై నువు సాగించిన
సమరాన్ని,మరువగలమా...
ధరిత్రి వున్నంతవరకూ..
చెరగని చరిత్ర కదా..నీ తలంపు.
ఓ..మనీషీ...
ఓ..మహర్షీ .
ఓ ..మహాత్మా..
ఓ..మార్గదర్శీ..
ఓ..మానవతామూర్తీ...
ఆచంద్రతారార్కమూ..
భరతజాతి అభివందనాలు మీకు,
నిమ్నజాతికై నిన్నటి నీ కృషికి
నిత్య నీరాజనాలు మీకు,
అంతరాలు చెరిపేసి
సమాంతరాలు కల్పించిన
కరుణాంతరంగుడా..
వందల తరాలు మారినా..
వందల అభివందనాలు మీకు...
అంబేద్కర్ జయంతి సంధర్భంగా...నివాళులర్పిస్తూ.....                    

                          శ్రీమణి

5, ఏప్రిల్ 2017, బుధవారం

రమణీయమదివో...


రమణీయమదివో
రఘుకులాన్వయుని కళ్యాణము
కమనీయమదివో 
కమలాలయని కళ్యాణము
అద్భుతమదివో
అమోఘమదివో,
అపూర్వమదివో ..
అమృతాస్వాదనమదివో
అయోధ్య రాముని కళ్యాణము 
కాంచిన కన్నులభాగ్యమేభాగ్యము
కొలచిన చాలట  నిత్యసౌభాగ్యము
జానకి రాములనిత్య కళ్యాణం 
జగమంతటికీ పచ్చతోరణం
ఆకాశం ఆణిముత్యాల పందిరి 
ఆ ధారణి  ధగధగ పెళ్లిపీట.
పట్టంచు పావడాలు,పట్టుపీతాంబరాలు 
చిగురు మావిళ్ల తోరణాలు,
చిరు కోయిలమ్మ సన్నాయి రాగాలు 
పంచభూతాలే మంగళవాయిద్యాలు 
పచ్చని చిలుకలే పేరంటాళ్లు 
పచ్చికలే పచ్చని పారాణులు 
మంచిముత్యాలు తలంబ్రాలు 
మంచి గంధాల,మల్లికలపరిమళాలు 
విసనకర్ర వింధ్యామరలు 
పానకాల మధురిమలు 
వడపప్పు,భోజ్యాల ఘుమఘుమలు
దేవుని పెళ్ళికి మనమేచుట్టాలు
చుట్టూరా చప్పట్లు సుమధుర ఘట్టాలు,
జానకి రాములనిత్య కళ్యాణం 
జగమంతటికీ పచ్చతోరణం
(శ్రీరామనవమి శుభాకాంక్షలతో )
                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

29, మార్చి 2017, బుధవారం

మధు మాసపల్లకినెక్కి ...



ఏ  మధుర రాగాలు ఆలపిస్తుందో 
ఏ మకరంధ కలశాలు గుమ్మరిస్తుందో 
ఏ అంబరాల సంబరాల  మోసుకువస్తుందో 
ఏ సంతసాల సంతకాలు చేయవచ్చిందో 
ఆ ఆనంద డోలికల ఓలలాడిస్తుందో 
ఏ మలయమారుతాల మైమరపిస్తుందో 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల 
మత్తకోకిల  రాగంలా 
మధురోహల పరిమళంలా 
మావిచిగురు సోయగంలా 
మధుమాస సరాగంలా  
మైమరపుల పరాగంలా 
మైవచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
పచ్చని మాగాణిలా 
నిత్యకళ్యాణిలా 
చైత్రపు మారాణిలా 
పచ్చని పారాణిలా 
రాణిలా 
మారాణిలా 
విరిసిన పూబోణిలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరాల 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా 
సిరిలిచ్చిగలగలా 
సిరులొచ్చి కళకళా 
విరులొచ్చి కలకలా 
వింధ్యామర వీచికలా 
తుళ్ళింతల కేరింతల 
తొలకరి గిలిగింతల 
ఇంతిలా 
చామంతిలా 
ముద్దపసిడి బంతిలా 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరేలా 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా
భవిత సింగారంలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
      హేవిళంబిసంవత్సర ఉగాది శుభాకాంక్షలతో .... 
                                                         సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 
 
 


26, మార్చి 2017, ఆదివారం

కళావేదిక

ముందుగా మన కళావేదికపుస్తకాలయ వ్యవస్థాపకులు శ్రీ నండూరి రామకృష్ణగారిని వేదికనలంకరించాల్సిందిగా కోరుచున్నాను,
ఆపన్నుల పాలిట అభయహస్తం వారు,అన్నింటా విజయాల పయనించు ధీమంతులు
యెంత ఎదిగినా ఒదిగివుండే వినయశీలురు,విత్తమ్ముతో ఎన్ని కార్యాలు  సాధించినా,చిత్తముతో సాయమందించు చేతులే మిన్నయని S.B.S.R ట్రస్ట్ స్థాపించి గ్రామగ్రామాలకూ సేవలందింస్తూ
కోస్తానలుమూలలా కీర్తిబావుటా ఎగురవేసిన అవిరళ కృషీ వలురు,                                                 శ్రీ సత్తి రామకృష్ణా రెడ్డిగారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము,

24, మార్చి 2017, శుక్రవారం

పూవు లేని తావి


సంధ్య వాలిపోయే 
సూరీడింటికి ఎల్లిపోయే 
గువ్వలు గూటికి చేరిపోయే 
నీ అలికిడయినా  లేదాయె
నాలో  అలజడేదో మొదలాయె 
ఎటు చూసినా .....  నీ అడుగుల సడి .
ప్రతీ జడిలో  నీవేనని తడబడి ,
ఘడిఘడికీ  మకరందపుమధు జడితో  
నీ తలపులు చొరబడి ,
నిద్దుర  కొరవడి
ఆ  ఊహల  ఒరవడిలో
నులివెచ్చని నీ ఒడిలో ...
తలవాల్చిన నా మది  
అది  తనువును విడివడి
విహంగమాయే వినీలగగనానికెగబడి,
అరనిమిషమయినా
నువు లేక నేను
పూవు లేని తావిని 
నీ జత లేని నేను 
సిరా లేని పెన్ను 
నువ్వెంట లేని గమనం
అది ఎండమావి పయనం
నీతో నడచిన సప్తపదుల సాక్షి
నిమిషమయినా ...
నిను చూడక నేనుండలేను,
సవరించిన నా కురుల సాక్షి
నీ సాంగత్యమే  వేయిపున్నముల సాటి. 
                                                           
                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి
                                                        pandoorucheruvugattu.blogspot.in
                             

23, మార్చి 2017, గురువారం

పదపదనిసలు


లివేణి  ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి  తుమ్మెద ఝుమ్మని గ్రోలబోవగా 
oదువదన సౌదర్యంఇనుమడించ మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా 
విద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా 
లతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే చలనం తేగా    
లికి  కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా 
చెలియ సిగ సోయగాన మల్లియ మరువం  వెలవెలబోగా
వ్వని జడపాయలు జలపాతాలై  జతులాడగా 
రుణి నుదుటఅరుణారుణకిరణం సింధూరమవగా 
ధారణి  ధరహాసపు ధగధగ  జలతారు మెరుపువగా  
నెచ్చెలి నడకల వయ్యారానికి  మయూరికే మతిచెడిపోగా 
డతి తేనియ పలుకుకు చిలుక మూగబోగా 
భామిని సొగసును ఏమని వర్ణించాలని కవి కవనం నివ్వెరపోగా 
ముదిత మోమును ముద్దాడిన ముంగురుల భాగ్యమే భాగ్యమో 
వ్వని  కరమున  జాలువారిన  రంగవల్లికి యోగమేమని చెప్పగలము . 
మణి తలపులు తడిమిచూసిన కలల రాతిరి ధన్యమే కద 
లన  తనువున నాట్యమాడిన చీరదే  జన్మవరమో 
విరిబోణి పాదాల పారాడె అందియల ఆనందమేలాగు వర్ణించగలము 
శోభనాంగిని అలంకరించిన సిరి  చందనాలదేమి పుణ్యము 
సురదన సుందర వదనం తాకిన మలయమారుతమ్ముదెంత సుకృతము 
oసయాన మిసమిసలు గాంచిన  అసలు సిసలైన జతగాని అదృష్టఫలమెంత లెక్కించ గలమా ...........
                       (తెలుగు అక్షరాలతో తెలుగు అమ్మాయిని వర్ణించాలనే నాతపన మాత్రమే) 


                                                                               సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 

                                                                       pandoorucheruvugattu.blogspot.in


22, మార్చి 2017, బుధవారం

అచ్చతెలుగు సోయగం


ఎన్నెన్నో అందాలు,
వెన్నెల సిరిగందాలు
మది బృందావనిచేరే
మృధు మందారాలై
ఆకాశం నీలి అందాలు అందుకోమంది
నాకోసం జాబిల్లి మధువు చిలకరించింది
కూనలమ్మ కులుకులిచ్చింది
వానలమ్మ వలపులిచ్చింది
కోకిలమ్మ కొత్తరాగమాలపించింది
పరువాలచిలకమ్మ 
పంచాదారపలుకులిచ్చి పలకరించింది
సయ్యాటనేర్పింది వయ్యారికలువభామ
ఒంపుసొంపులద్దింది సంపెంగపూరెమ్మ
పులకింత పంచింది పలుకుతెనేలమ్మ
అవి చాలక ఆ తారక తళుకును అరువడిగా
పుణికి పుచ్చుకొన్నా... తెలుగునేల సారాన్ని 
   అందిపుచ్చుకొన్నా... అచ్చతెలుగుసోయగాన్ని 
అచ్చరకన్యను కాను
అచ్చతెలుగుసోయగాన్ని. 

                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి   
               pandoorucheruvugattu.blogspot.in