పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, సెప్టెంబర్ 2026, శనివారం

మార్గదర్శి

మార్గదర్శి

ఉదయించే జ్ఞానం
నడిపించే ధైర్యం
జీవించే నైపుణ్యం
శోభించే ఔన్నత్యం
సహృదయం,సద్భావం,
అలవరచగ ఇల వెలసిన
ప్రత్యక్ష దైవమా..
ఉపాధ్యాయుడా....ప్రణమిల్లెద మీకు
ఉజ్వల భవిత
ఉత్తమ నడత
ఉన్నత సంస్కారం
మాన్యతను,మానవతను
ప్రబోధించి మనిషిని మనీషిగ
మలచిన మార్గదర్శీ..
ప్రణమిల్లెద నీకు
జ్ఞానసూర్యుడా...
విజ్ఞాన ప్రదాతా..
మేలుకున్నది మొదలు
మా మేలుకై పరితపించి
కర్తవ్యం స్ఫురింపజేసే
కాంతిపుంజమా...
విద్యాదాతా.... విద్యా ప్రదాతా
ఉపాద్యాయుడా...ప్రణమిల్లెద మీకు
అజ్ఞానపు చీకట్లను బాపి
వెలుగులనిచ్చే వెలుగులదొరా...
ఒట్టి మట్టిముద్దను సైతం
మహామేథావిని గావించగల
మహిమాన్విత శిల్పీ..
అక్షరక్షీరాలనొసగి
జ్ఞానార్తిని తీర్చిన అమ్మలా
మంచి,చెడులు నేర్పించిన నాన్నలా
వేలుపట్టి దిద్దించి
వేలుపువైనావు
జన్మంతా సేవించినా
తీరునా నీ ఋణం
వెలకట్టలేని విద్యాసిరులను
వరమిచ్చిన గురువర్యా..
ఉపాధ్యాయుడా....ప్రణమిల్లెద మీకు
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో)

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=J3eheEYp0uhDlcbI

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి