నిజం చెప్పవా...కృష్ణా!
నే... నీదానను కానా..
నీవు లేక నిమిషమైన
నేనుండగలనా...
నిన్నటి నీమాటలన్నీ...
నీటి మీద రాతలా..
చేసుకొన్న బాసలన్నీ..
చెరిగిపోయే ఊసులా...
పెనవేసుకొన్న మన
మనసుల కధలన్నీ
ఒట్టి కట్టుకధలేనా...
నువ్వుండేదా...గగనంలో
నేనేమో...ఇలాతలంలో
ఆశలరెక్కలతో
విహంగమై విహరిస్తున్నా..
అలుపెరుగని పయనంలో
అనుక్షణమూ...నీకోసం
అన్వేషిస్తున్నా...
ఎన్ని జన్మలెత్తాలిక
వెన్నదొంగా...
నీ పద సన్నిధి చేరగా...
చెప్పు నిజంగా...
నల్లని వాడా...నావల్లకాదిక
తనువంతా కనులై
వేచియుంది.....ఇదిగో...నీరాధిక
(రాధమాధవీయం)
Super poetry!!
రిప్లయితొలగించండిSuper poetry!!
రిప్లయితొలగించండిThank u very much
తొలగించండిSuper poetry!!
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారండి
రిప్లయితొలగించండిexcellent poetry your words are magical
రిప్లయితొలగించండి