పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

8, ఏప్రిల్ 2015, బుధవారం

ప్రణయ రాగ ప్రవల్లిక

                             
ఆ సుందర వినీల   గగనాంగన  శిగ లో మెరిసిన  వెన్నెల పొదిగిన వన్నెల తారకను . అరుణారుణ కాంతులకై వేచి యున్న సువర్ణ కమలకాంతను నేను . వాసంత సమీర వింధ్యామరలో సిరి చందనాల కలగలిపిన మైమరపుల పరిమళాన్ని ,పసిడి నేలపై  పారాడే పచ్చికపై పారాడే మంచు ముత్య బిందువును.. నర్తకి  నయాగరా జలపాతపు సిరి అందెల రవళిని ,విరిని ,విరిబోణిని,మరువంపు మాలినిని  , ప్రకృతిలో  హొయలన్నీ నా జడపాయల నింపుకొన్న జవ్వని నేను . వెన్నెల రవ్వను . మధురిమలొలికే  కమ్మని కవనంలో కవ్వించే కవితాకన్యకను  , ఝుమ్మనే మధూలికపు వలపుల ,సింధూరంలా  విరబూసిన ముద్దమందార నెచ్చెలిని .  ప్రకృతిలో  అరవిరిసిన  సౌందర్య చంద్రికను . సంధ్య వాకిట దిద్దిన రంగుల రంగవల్లికను .                                                
ఆ సంద్రపు తీరంలో ఉవ్వెత్తున పొంగిన అలను ,కనులకు కానుకలా ... ఓ కమ్మని  కలను .  కదిలే ఎల్లోరా శిల్పాన్ని పరువం  మదిలో మెదిలే ప్రణయ రాగ ప్రవల్లికను . మందాకినిని ,మకరందపు ఝరిని ,
నవ్వుల హరివిల్లుని , చిగురాశల పొదరిల్లును . మధురోహల విరి జల్లును , సృష్టిలోని   సొగసులకే సొబగులద్దె మేటి 
సోయగాన్ని , ఏమని చెప్పను ఆమని నేను. పరువపు ప్రాయంలో ప్రతీ పడతి  సౌందర్యాతిశయాన   తనకు తానె సాటి అనుకొనే భావన ఇది . నిజానికి ప్రతీ మది అనుభవించిన మృదు భావనఇది       
                                                                                                సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి  








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి