పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

11, ఏప్రిల్ 2015, శనివారం

రాధను నేనే



  నా మనసున మెదిలిన నీ ఊహలు రెక్కలు తొడిగి , నిను చేరే ప్రయత్నంలో  ఆ గగన వీధుల్లో విహరిస్తుంటే 
 అవద్దుల్లేని  ఆనందం ఏదో నన్ను ఆద్యంతం ఆవహించినట్టు . 
వింత వింత కలవరింతలేవో చెంత చేరి కలవరపెడ్తుంటే , నా హృదయంలో సుతిమెత్తని రాగమేదో స్పష్టం గానే  వినిపిస్తోంది . హృదయ శ్రుతి లయల నడుమ . 
కను పాపల్లో  ఏదో కమనీయ చిత్రం కదలి కలవర పెడుతుంది .అది నీలానే ఉంది . నీలి మేఘ వర్ణంలో 
అస్పష్టమైన ఆలోచనలతో సతమతమవుతుంటే ,ఆ మౌనం లోనే ఏదో తెలియని హృదయపు సవ్వడి 
నాకైతే అనిపిస్తుంది . అది నీ రాకకు ముందు నీ వర్తమానమని ,
అస్తమాను నీ  ధ్యానంలో నే పరధ్యానంగా ఉంటే 
ఏదో దృఢమైన సంకేతం .  నన్ను నీలో కలిపేస్తుందని , ఆకాశవాణి లా ......... 
నీకై వేచిన నిరీక్షణలో కూడా అనిర్వచనీయమైన అనుభూతి  నను స్పృశిస్తుంటే 
 నువ్వెదురుగా ఉన్నా ...... నువ్వేడ దాగున్నా ... 
నా  హ్రుదయానికెప్పుడూ చాలా సమీపంగానే కనిపిస్తూ 
నువ్వల్లంత  దూరంగా ఉన్నా .......... 
నీ పిల్లనగ్రోవి సరిగమలు ,నీ అల్లరల్లరి కవ్వింతలు ,మారుమ్రోగు తున్నవి కదా నా మది సామ్రాజ్యమందు 
యమునా తీరం , సాయం సమీరం , ఆ ప్రణయ విహారం , ఆహా 
ఆనాటి  నా కిట్టయ్యా .... కినుక వహించక  నాపై ...  నులివెచ్చని నీ ఎద సన్నిధి లో నువ్వు మెచ్చిన  నెచ్చెలి నేను .
 నీ పాదముల నివశించు ప్రణయ రేణువును .. నీ అధరముల ప్రవహించు వేణువును  ........నీలో కలగలిసిన అణువణువును .. నీకై నిరీక్షించే నీ వలపుల రాధను నేనే ..........(శ్రీ కృష్ణునికై .... నిరీక్షణ )
                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి