పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఆశ.. చిన్ని చిన్ని ఆశ..

ఆశ... చిన్ని చిన్ని ఆశ..
సంధ్యాసమయంలొ,
భానునితో దోబూచులాడాలని ఆశ
వర్షించే సమయంలో,
హరివిల్లుపై నాట్యమాడాలని ఆశ
మేఘమాలికపై ఊయలలూగాలని ఆశ
నిండు పున్నమిలో,  వెండి వెన్నెలలో,
పారిజాతపానుపుపై నిదురించాలని ఆశ
పంచవన్నెల చిలుకలా ఎగిరిపోవాలని ఆశ
మానస సరోవరమున చేరి 
రాయంచల సరసన జలకాలాడాలని ఆశ
చుక్కలపల్లకిలో విహరించాలని ఆశ
ఈ భువిని వీడి నీలిమేఘములకేగి
హాయి హాయిగ సాగి జాగుసేయక 
చంద్రబింబమును చుంబించాలని ఆశ
ఆశ.. చిన్ని చిన్ని ఆశ...

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఈ వేళలో.. నీవు ఎం చేస్తు ఉంటావొ...

మనసున మల్లెలు విరిసినవేళ ,
నీ సాంగత్యపు సుమధుర క్షణాలు
మది తాకిన ఘడియ !
జాబిల్లి మబ్బులమాటున దాగిన వేళ,
సంపంగిపూల పరిమళాలతొ పరవశించిన
నీ ఒడిలొ, నే సేదతీరిన ఘడియ !
పిల్ల తెమ్మెరలు మెల్ల మెల్లగా మేనిని తాకుతున్న వేళ,
నీ స్పర్శానుభూతి, నేననుభవించిన ఘడియ !
నా కనులు నీ కలలతొ నిండిన వేళ,
నీ తలపుల తన్మయత్వములో,
నే మురిసిన ఘడియ !
సన్నజాజుల పరిమళాలతో, 
వేయి పున్నముల వెన్నెల కురిసిన వేళ,
నీ ఆలింగనములో నన్ను
నేను మైమరచిన ఘడియ !
కలువభామ చందురునికై వేచినటుల ,
స్వాతి చినుకుకై చూసె ముత్యపుచిప్పలా,
చీకటిలో మిణుగురులా తిరుగాడుతూ ,
క్షణ క్షణమూ నిన్నే స్మరిస్తూ క్షణమొక ఘడియలా,
నీ సాంగత్యపు ఘడియలను తలచుకొంటూ...
ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ ...
అనుకొంటు ఉంటాను ..ప్ర తి ఘడియలో నేను .

24, సెప్టెంబర్ 2011, శనివారం

ఓ.. వ్యధ!

తుమ్మెదా ఓ చిన్ని తుమ్మెదా 
జోరు జోరుగ నీవు ఎగిరిపోతుంటావు 
తియ తియ్యని మధువు గ్రోలుకుంటావు 
ముచ్చటగ పూలతో ఊసులాడతావు
హాయి హాయిగ నీవు విహరిస్తు ఉంటావు 
నా వ్యధను చెపుతాను ఒకసారి ఆగవె 
అనురాగమందించు ఆశలే  లేవే 
ఆనందమనిపించు ఘడియేది లేదె 
కన్నీట ఓదార్చు చేతులే  లేవె 
కష్టాల కడతేర్చు కలలైనా రావె 
మరుజన్మ ఉంటే  నీలాగె పుడతా 
జన్మ జన్మలకైన మనిషి కాలేను

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

స్నేహ కుసుమం

మొగ్గ విరిసి పుష్పమైన రీతి  
మనసు కలసి స్నేహమౌను 
ఆ కుసుమం చిగురుకొమ్మన  మెరిసినటుల 
మన స్నేహం జీవిత చరమాంకం వరకు నిలవాలి 
ఆ సుమం పలువురికీ పరిమళాలు పంచినటుల 
మన స్నేహం అందరికి ఆదర్శం కావాలి  
కాని,
ఆ పూవు వాడిపోయినా 
రూపు మారిపోయినా 
మన స్నేహం మాత్రం చిరకాలం చిగురించాలి 
ఈ స్నేహ సుమం వాడని కుసుమం 
అది  మరచిపోకు నేస్తమా  
నను విడిచిపోకు మిత్రమా.

22, సెప్టెంబర్ 2011, గురువారం

చెప్పుకోండి చూద్దాం..... నేనెవరో చెప్పుకోండి చూద్దాం ???



పచ్చని మైదానంలొ 
పచ్చికపై జాలువారు కిరణము నేను
పున్నమి రాతిరిలో మనసును ఆహ్లాదపరచు
వెండివెలుగు రేఖను నేను 
విరిసీ విరియని రోజారేకున
ఊగిసలాడిన హిమబిందు నేను 
సంకురాతిరి సంధ్య వెలుగులో 
పడతి వాకిట తీర్చిదిద్దిన  రంగవల్లిని  నేను 
పురివిప్పిన నెమలికి అరుదగు నాట్యం నేర్పిన 
అచ్చర నర్తకి నేనే 
విరజాజులార, విచ్చిన చామంతులారా 
ఎగిసే కెరటాల్లార,
పయనించే నీలి మబ్బుల్లార,
చెప్పుకోండి చూద్దాం.. 
నేనెవరో చెప్పుకోండి చూద్దాం ??? 

21, సెప్టెంబర్ 2011, బుధవారం

శుభాకాంక్షలు

విరబూసిన విరులు, మరువము, మల్లియలు, 
గుభాళించి చెపుతున్నవి నీకు శుభాకాంక్షలని 
వీచే తెమ్మెరలు, నులివెచ్చని చంద్రికలు 
పిల్లగాలితొ కబురంపాయి నీకు శుభాకాంక్షలని 
గొంతుక సవరించుకొని గున్నమావి వంకలోంచి ఆమని రాగం 
జల జల పారేటి సెలయెటి మధుర సరాగం 
చెపుతున్నవి నీకు శుభాకాంక్షలని  
మది అంతా  మధురమైన నీ తలపులతొ నిండియున్న
నీ సఖి వేచియుంది కవితా సుమమాలతొ నీకు శుభాకాంక్షలని  

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఎంత మధురమీ నిరీక్షణ

నేనెక్కడ., నీనేక్కడ
నా మది ఎక్కడ, నా తనువెక్కడ
నెనున్నది
నా చెలికాని నిరీక్షణలో
ఆతని తలపుల ఊహల యలలో 
ఎమైంది నాకీవేళ,
ఎందుకింత ఆనందహేల
పక్షుల కిలకిలారావాలు , కోయిలమ్మ కువ కువలు,
అరవిరిసిన కలువలు, పైరగాలి పిల్లతెమ్మెరలు ,
అవధుల్లేని ఆనందంతో నా దరి చేరి
నా సఖుడరుదెంచు కబురేదో చెబుతుంటే
నా ఎదలో ఏదో చిరుసవ్వడి
వింత వింత ఊహలతో ఏదో అలజడి
నీలాకాశం నిర్మలంగా నవ్వుతుంది నన్ను చూసి
నీ నిరీక్షణ ఫలించినదని,
నీ సఖుని చేరబోవు ఘడియ అరుదెంచినదని,
నా తనువంతా పులకరించే తన్మయంతొ
అలవోకగ నా అధరాలు ఆలపించె కొత్తరాగాలెవో 
నా చెలికాని నిరీక్షణలో ...
నిరీక్షణ కూడా మధురమే కదా

ప్రయాణం

అలల ప్రయాణం తీరం వరకే 
కలల ప్రయాణం మెలకువ వరకే 
మబ్బు ప్రయాణం కురిసే వరకే 
నదుల ప్రయాణం కడలి చేరే వరకే 
మనిషి ప్రయాణం మరణం వరకే 
మరి 
మనసు ప్రయాణం ???

17, సెప్టెంబర్ 2011, శనివారం

ప్రియతమా

నా తలపుల వనంలో 
విరబూసిన పారిజాతమా
 నా జీవన బృందావనిలో 
వినిపించిన వేణుగానమా
 నా గుండె గొంతుకలో 
పలికిన మృదుసరిగమా 
నా మనసును శృతి చేసిన వీణా నాదమా 
 ...... ప్రియతమా ......
మదిలొ మెదిలె మధురగీతమా 
కన్నుల కదిలె పసిడి స్వప్నమా 
నా ఊహల ఒదిగిన నా ప్రాణమా 
మమతను పంచే మధురాను రాగమా
మరపు రానిది నీ ఔన్నత్యం 
మరువలేనిది నీ సాంగత్యం 

వరాన్వేషణ

చిలకమ్మ అడిగింది చిగురాకుని 
చిరునవ్వు వెల  యెంతని? 
భ్రమరం అడిగింది పూబాలను
తన నోరూర్చు మధువేదని ? 
చిరు కోయిల అడిగింది వాసంతాన్ని 
తనని కరుణించగా రావా అని 
కలువభామ అడిగింది చందమామని
తనని చుంబించు ఘఢియ ఏదని  
తరచి తరచి అడిగింది పడతి, ప్రకృతిని 
తనను జతచేరు వరుడేడని

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

స్త్రీ ( ప్ర ) గతి

 ఓ మహిళా ఏది నీ ప్రగతి ?  
స్త్రీ అంటే మాతృమూర్తి అని తెలుసు,  
వెన్నవంటిది ఆమె మనసు 
అనురాగానికి చిరునామా ఆమె  
క్షమ, సహనం,  ఔన్నత్యాలకు ఆలవాలం ఆమె 
ఇంటికి మాత్రమేకాదు ఆమె దీపం  
సృష్టికి మూలం ఆమె  
మరిఎందుకు అంత అలుసు ?  
అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిస్తే...
స్వాతంత్ర్యం అన్నారు గాంధీ,  
రాక్షసమూకలు జగతిని ఉండగా..
పట్టపగలే కరువైంది... నేటి మన భారతంలో  
వంచించకు వనితను వంటింటి కుందేలని
పురుషాధిక్యం జగతిని మెండుగయుండగ
ఇంతి బ్రతుకు ఇక దండగా ?  
కాదు..  కానే కాదు...  
వీర నారి ఝాన్సి కాదా ఆడది , 
రాణి రుద్రమ కాదా ఆడది ,  
మన ఇందిర కాదా ఆడది,   
అంతరిక్షానికేగిన మన సునితా విలియమ్స్ కాదా ఆడది  
తెలుసుకదా వాళ్ళ హిస్టరీ  
చెయ్యొద్దు  మహిళ బ్రతుకు ఒక మిస్టరీ . 
ద్విగుణీకృతం చెయ్యండి వారిలో 
ధైర్యం, స్థైర్యం 
 సహకరించి, ప్రోత్సహించి 

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

పడుచు మనసు



తెలతెల్లగ తెల్లారగ ఉలిక్కిపడి లేచింది 
తారలపందిరిలో శయనించిన కన్నెభామ 
ఎందైనా యెందెందైనా నాకు సాటియెవరన్నది.. 
నాకు ధీటు యెవరన్నది
తన సౌందర్య పరవసాన తానె ముగ్దురాలైనది 
పంచభూతాలపై నాట్యమాడుతానన్నది 
సింధూరపు భానుడినె నానుదుటున తిలకముగా దిద్దుతాను 
కటికచీకటి నాకనులకు కాటుకగా గీసేస్తాను
వెండిమబ్బును నా నడుమకు చీరగ చుట్టెద 
నెలవంకనె అలవోకగ నా మెడలొ ఆభరణం చేసేస్తా
గంగా, యమునా, క్రిష్ణా, పెన్నా 
నదులేవైనా, సెలయేరులేవైనా...
అన్నీ నా చెలరేగిన కురులే కదా 
సప్తసంద్రాలైన లక్షద్వీపాలైన 
కొండలైన.. కోనలైనా... కోయిలమ్మ కూతలైనా 
నా అందానికి తీరుగ దిద్దిన తుదిమెరుగులు కావా 
ఆని చిరునగవును చిలుకరించె పులకరిస్తూ .. పడుచు మనసు 

8, సెప్టెంబర్ 2011, గురువారం

ప్రణయ ప్రబంధం

ఎద నందన వనమున 
సుమసుగంధ వీచిక ప్రేమ
హృదిస్పందన శృతి లయగా 
వినిపించిన మృదుగీతిక ప్రేమ
మది అంత నిండియున్న 
వింత విషయసూచిక ప్రేమ 
పడుచు మనసున విరిసిన మల్లియ ప్రేమ 
కురిసిన వెన్నల ప్రేమ 
కలలమాటున.... కనురెప్ప చాటున.... 
కన్నుగీటుతూ పలుకరించిన
కలవరింత ప్రేమ 
తొలి పులకరింత ప్రేమ 
ఇదే ప్రణయ ప్రబంధం 
చదువలేని అద్భుత గ్రంధం