*ఒక తీయని కల*
అమృతాన్ని ఔపోసన పట్టినట్టు
ఆకాశాన్ని అదిమి పట్టినట్టు
మబ్బులతో దోబూచులాడి
ఇంద్రధనుస్సు వంపులో ఇమిడిపోయినట్టు
చలువల రేడు వెన్నెల జల్లుకి పులకించిన
నెచ్చెలి కలువను నేనన్నట్లు
అచ్చర కన్యల తలదన్నే అప్సర నేనన్నట్లు
అందాల రాజ్యానికి అధినేత్రి నైనట్టు
రంగూ రంగుల సీతాకోక చిలుకల్లె
విరబూసిన పూదోటల్లో విహరించినట్టు
స్వాతి చినుకు ముద్దాడిన
ముత్యం నేనే అన్నట్టు
అరుణోదయ ఉషస్సులో
ఆ సంద్రంపై మెరిసే అలనైనట్టు
అలా ... అలా ... అలా ... అలలా మెదిలిన
నా మధురమైన కలల సడికి
నులివెచ్చని నా నిదుర చెడి
నివ్వెరబోయా !
ఆ రవి కిరణపు తాకిడికి.
మన కలలో మనమే కదా కధానాయిక ..... (మీక్కూడా .. అంతేనా )
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి