గోదారమ్మ గుండె బరువయ్యింది
కన్నీళ్ళతో చేరి చెరువయ్యింది
కడుపుకోతతో తో బావురుమంది .
కల్ప తరువంటి కన్నతల్లిఒళ్లో
బిడ్డకి భద్రత కరువయ్యింది .
పొరపాటో ,
గ్రహపాటో
ఏమరపాటో,
ఏ దిష్టి చెరపాటో ,
వెన్నంటే ఉండాల్సిన అధికార యంత్రాంగం
దిక్కులు చూస్తుందో ...
కన్నులుండి గ్రుడ్డితనం ఆవరించిపోయిందో
నిర్లక్ష్యం నిలువునా నిండు బ్రతుకులు బలి కోరిందో
.కన్నీరు పెట్టి "కొంటే" ప్రాణం తిరిగొస్తుందా
ముందే మేల్కొని ఉంటే ఏడ్చే పని మీకుందా ...?
(ఇకనైనా దయచేసి నిర్లక్ష్యం వీడండి . అమాయకుల ప్రాణాలు కాపాడండి . )
అభ్యర్ధనతో ......
సాలిపల్లి మంగామణి @శ్రీమణి