పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

22, డిసెంబర్ 2016, గురువారం

7వపాశురరత్నము


7వపాశురరత్నము

కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు
పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్


జై శ్రీమన్నారాయణ 
సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
pandoorucheruvugattu.blogspot.in

21, డిసెంబర్ 2016, బుధవారం

6వ పాశురరత్నము


6వ పాశురరత్నము

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
తెలుగులో భావార్ధము ;
ఈ వ్రతము యొక్క దివ్యమయిన అనుభవమును అందరితో 
సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన దగుటచే తక్కినవారందరలనూ మేల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము. క్రమముగా ఒక్కక్కరినీ లేపెదము. రండు. తెల్లవారిందనుటకు పక్షులు కిలకిలారావములనొనర్చుచు కదలిపోవుచున్నవి సుమా సుమా!ఆ పక్షులయొక్క రాజగు గరుడునిగూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవెలయందు,ఆరాధనయొక్క సమయమును సూచించెడి ప్రభాతసమయ శంఖారావము స్వఛ్చముగా ,పెద్దగా ,రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమోయీ చిన్నపిల్లా !వినపడుటలేదా !లేచిరమ్ము.మేమెటుల వచ్చినామో తెలియునా ?పూతనా రాక్షసియొక్క వక్షములందుగల విషమారగించి,దొంగబండిరీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నియు ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు, ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రనొనరించుచున్న జగత్కారణుడని మన గోశాలయందున్న మునుసమూహములు,యోగాభ్యాసము నాచరించువారలు కూడ ఆ శ్రీకృష్ణుని తమతమ యొక్క మనములందుఅంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగ మెల్లగా లేచి "హరిహరి"యని స్తోత్రమొనరింప వీరందరి యొక్క గొంతులు పెద్దధ్వనియై మా మనస్సులందు చల్లగ ప్రవేశించి లేపివేసినది. ఇపుడు నీవునూ వినియుంటివి గనుక లేచి రావమ్మా!
కడు మనోహరమగు వర్ణనలతో కూడి గోదాతల్లి రచియించి తను తరించి,శ్రీరంగని వరించి,మనల్నీ తరింపచేసిన తిరుప్పావై 6వ పాశురాన్ని,అలంకరణనూ మీముందుంచుతూ,మీ అందరి ఆశీస్సులను కోరుతూ.... 
జై శ్రీమన్నారాయణ .... 
 సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
pandoorucheruvugattu.blogspot.in




20, డిసెంబర్ 2016, మంగళవారం

5వ పాశుర రత్నం



5వ పాశుర రత్నం 

మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

5వ పాశురం తెలుగు భావార్ధం;

మనమందరమూ ఈ వ్రతము నాచరించి ఫలమును పొందుటకు,మనమొనర్చిన పాపకృత్యములు ఆటంకపరచునేమో యనెడి భయము నొందవలదు. అందులకు కారణమేమన;మన వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడై యున్నాడుకదా!అనేక ఆశ్చర్యకరములగు గుణ విశేషములు,క్రియలను కల్గినవాడాతడు.ఉత్తర మధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి,నిర్మలములై,గంభీరమైన జలములుగల యమునానదీ తీరవాసిగా,మనకొరకై గొల్లకులము నందుదయించి ఈ కులమును ప్రకాశింపచేసినటువంటి మంగళ కర దీపమై యున్నాడు. ఇంకనూ తన జన్మముచే  యశోదా దేవి యొక్క గర్భమును కాంతివంతమొనరించిన పర్వతమును కల్గియూ ఆమెచే కట్టబడినటువంటి సులభుడున్నూ!కాబట్టి మనమందరమున్నూ సందేహాదులనెడి మలినములు లేక నిర్మలులమై,ఆతని యొద్దకు సమీపించి,చేతులారా నిర్మలమయిన మన హృదయపుష్పమును సమర్పించి నోరారా గానమొనరించి,మనసారా ధ్యానమొనరించాలి. తక్షణమే నిల్వయున్నటువంటి సమస్త పాపరాశియు,రాబోయెడి పాపముల యొక్క రాశియున్నూ అగ్నియందుబడిన దూదిపింజవలె భస్మమయి మన ఈ వ్రతమున కవరోధము తొలగిపోవును. అందుచే రండు,భగవన్నామమును కీర్తింతుము.

ఈ రోజు 5వ పాశుర పారాయణము చేసాను. మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ ......
                                                                              జై శ్రీమన్నారాయణ
                                                                       సాలిపల్లి మంగామణి@శ్రీమణి
                                                                      pandoorucheruvugattu.blogspot.in

19, డిసెంబర్ 2016, సోమవారం

4వ పాశుర రత్నం

4వ పాశుర రత్నం 

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


తెలుగులో భావార్ధం; 
ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకూ దేవతాదులు అందరున్నూ తమతమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణ దేవునికలిసికొందుము. గంభీరమైన స్వభావము కల్గి వర్షాధి దేవతవైన ఓ పర్జన్యుడా!నీవు వెనుకంజ వేయబోకుము.గంభీరమయిన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటిని అంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమంతటనూ వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడయిన ఆ శ్రియపతియొక్క శరీరరీతిగా నీల శరీరివై యుండుము. అటు పిమ్మట విశాలము,సుందరములయిన హస్తములుగల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీసుదర్శనచక్రము వలె తళుకుబెళుకుమని మెరసియు, వామహస్తమందలి పాంచజన్యశంఖము వలెనూ లోకములన్నియూ అదురు రీతిన ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారఙ్గమనేడి ధనుస్సుచే విడువబడిన శరవర్షమను రీతిన లోకములు అన్నియును సుఖమునొందునటుల అంతటనూ వర్షించుము. అపుడు మేమున్నూ ఈ మార్గశీర్ష వ్రతస్నానమును ముదమార చేయుదుము. 
ఈనాటి తిరుప్పావై నాల్గవ పాశురాన్ని ముదామారా పాడుకొని పావనమయితి,మీ అందరి ఆశీస్సులకై ఆ పారవశ్యానుభూతిని మీతో పంచుకొంటూ .... 
                                                                                    జై శ్రీమన్నారాయణ 
                                                                            సాలిపల్లిమంగామణి@శ్రీమణి 





18, డిసెంబర్ 2016, ఆదివారం

3వ పాశురరత్నం



3.వ పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్

తెలుగులో భావార్ధము;
రాక్షస రాజగు బలి చక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తమునియొక్క దివ్యములయిన చరణారవిందముల నామముల గానమొనరించి,మనమందరమున్నూ ఈ తిరుప్పావై వ్రతము నాచరించిన దేశమందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షములు కురియును. పంటచేలు అన్నియునూ త్రివిక్రమునివలె వృద్ధినొంది సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు త్రుళ్ళి పడచూ ఉండ,సుందరములయిన కలువలయందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొన్నవిగా నగును. మరియును గోసమృద్ధి విషయమునందునూ గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటునిటు కదలక కూరుచుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలను నింపెడి ఔదార్యము కలవిగా తయారవును . ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమునూ   లభించును. కాబట్టి మనమందరం ఈ వ్రతమాచరించెదము.

మూడవ రోజు పాశురాన్ని పారవశ్యాన పఠించి,ఆధ్యాత్మికామృతాన్ని ఆస్వాదించిన నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ ...... జై శ్రీమన్నారాయణ
   
                                                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి




17, డిసెంబర్ 2016, శనివారం

2వ పాశురరత్నము

2వ పాశురరత్నము
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు 
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

తెలుగులో భావార్ధము;దుఃఖములతో నిండియున్న ఈ పృథివియందు జన్మించియున్న భగవానుని తలచుకొని సుఖమొందుచున్నావారా !మన మొనరించబోవు ఈ తిరుప్పావై అనెడి ఈ మార్గ శీర్ష స్నాన వ్రతమును ఆచరించెడి విధానములను వినగోరుచున్నారు. క్షీరసముద్రమునందు  నిశ్శబ్ధ సహితముగ  మొరలు ఆలకించుటకై శయనించి యుండెడి ఆ పురుషోత్తముని యొక్క పాదపద్మములనే కీర్తన నొనర్తుము,విలాస సంబంధ వస్తువులయిన క్షీరమును త్రాగకుందుము. ఇంకనూ తెల్లవారకనే స్నానమొనరించి కనులకు కాటుక దీర్పము. 
సుగంధభరితములయిన పుష్పాదుల తలలో ముడువము., అనర్ధకములయిన క్రియలు నాచరింపము,ఇతరుల మనసుల నొచ్చు రీతిన మాటలాడముపెద్దవారలను ఘనమయిన రీతిన సత్కరించుటయు ,సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రలయందు భిక్షమిడుటయు,దాపరికము లేకుండ యధాశక్తిగ చేయుదుము. ఇవ్విధమైన శాశ్వత మగు సుఖమునొసగెడి ఆత్మోజ్జీవన మార్గమును నరసి యానందముతో దానిని అనుష్టించెదము. 
ఇదియే మనయొక్క వ్రతము . 
           
 రెండవ పాశురము కడు రమ్యముగా పఠించి తరించితి,మా మందిరములో ఆ వ్రత దృశ్యాలు మీతో పంచుకొంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. 
                                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


16, డిసెంబర్ 2016, శుక్రవారం

శ్రీరంగనాధా మమ్మేలంగ రావా ...



శ్రీరంగనాధా మమ్మేలంగ రావా ...  
నేను ఆచరిస్తున్న  ధనుర్మాస వ్రతధీక్ష ఫలవంతమవ్వాలని మీ  ఆశీర్వాదం  
గోదా దేవి  శ్రీరంగనాథుని ఆరాధించి,భక్తి తన్మయత్వంతో స్వయంగా లిఖియించిన అమృతతుల్యమగు తిరుప్పావై  పాశుర ప్రభందం లో ఈ రోజు మొదటి పాశుర రత్నం చదివి మా ఇంటిలో అత్యంత సుందరంగా ధనుర్మాసవ్రతాన్ని ప్రారంభించి తరిస్తూ ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీతో పంచుకోవాలని ...
తిరుప్పావై మొదటి పాశురము

మార్గళి త్తిఙ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్,పోదుమినోసెరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పొడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోధై యిళంశింగమ్
కార్మేనిచ్చ ఙ్గళ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్  పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్
తెలుగులో అర్ధం ,
మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమనిచెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..
                                                       జై శ్రీమన్నారాయణ 
                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

2, డిసెంబర్ 2016, శుక్రవారం

తరుల గుండె తరుక్కుపోయి......



ఈరోజు ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం (2/12/2016)సందర్భంగా 
సమాజానికి  కవయిత్రిగా నా చిరు కవితాభ్యర్ధన. 

తరువులు  తల్లడిల్లె 
తమ ఉనికి మాయమౌతుందని
మానవులకు  తాముచేసిన  
అన్యాయమేమనుచు.  
మానవాళికి   ఆయువిచ్చు 
తమ ప్రాణం తీయుదురాయని 
నీడనిచ్చు మా జాతిని 
నిర్దయగా కూల్చివేయుదురాయని ?
మీ పాపానికి తారెత్తిన భూతాపం 
చల్లార్చిన మాపైనా  మీ ప్రతాపం 
మిము కబళించే కాలుష్యం కరిగిస్తూ 
అలసిన మీకు చల్లని గాలుల సేద తీర్చుతూ 
అమృత ఫలాల తో ఆకలి తీర్చుతూ 
మా తనువున అణువణువును మానవాళికర్పించే  
మా పైనా  మీ అమానుషత్వం 
జాలిలేని మానవుడా మా జోలికి రావొద్దని ,
మా  ప్రాణం  తీయొద్దని విలపిస్తూ  
వేడుకొనెను విరిగిన కొమ్మల తోడ. 
అపకారికి ఉపకారం  మహాత్వమన్నారే 
మీ జాతికి మహోపకారం  చేసిన 
మా కిదేనా  మీ ప్రత్యుపకారము 
మము ఉద్దరించగ ఉద్యమించండి  
నవ ఆశోకులయి  నడుం బిగించండి 
పుడమి తల్లి  పులకరించగ  ప్రకృతిమాత    
పరవశించగ కరువు  రూపు మాపగా 
పర్యావరణం పరిమళించగా  
భావితరంలో  పచ్చని  పసిడి నింపగా 
పచ్చని మొక్కని నాటి పెంచుదాం  
వృక్షజాతి ఋణం  తీర్చుదాం 
                                                         సాలిపల్లిమంగామణి@శ్రీమణి

                                                   pandoorucheruvugattu.blogspot.in